బండ్ల గణేశ్.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. హాస్యనటుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమంది స్టార్ హీరోలతో సూపర్హిట్లు తీసిన ఆయన.. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. అయితే తన ట్విట్టర్ ద్వారా శనివారం షాకింగ్ కామెంట్స్ చేశారు బండ్ల.
గుడ్‌బాయ్..
"త్వరలో ట్విట్టర్‌కు గుడ్‌బాయ్ చెప్పేస్తా. వివాదాలు ఏమీ లేవు.. నా జీవితంలో నేను ఎలాంటి వివాదాలను కోరుకోవటం లేదు" అంటూ బండ్ల గణేశ్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
2020 జనవరిలో విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో చివరగా కనిపించారు బండ్ల. ఈ సినిమాలో తన మార్క్ కామెడీతో అలరించారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి కొన్నినెలల క్రితం హాజరైనప్పుడు.. సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఎదిగిన క్రమంలో హీరో పవన్‌కల్యాణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:Bandla ganesh: 'వాళ్లకు పెన్‌తో కిక్.. నాకు మైక్ ఉంటే కిక్!'