తెలంగాణ

telangana

ETV Bharat / sitara

bandla ganesh: 'అందుకోసమే ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​కు వీడ్కోలు' - మెగా ఫ్యామిలీ

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్​ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి 'మా' ఎన్నికల్లో ప్రకంపనలు సృష్టించారు నిర్మాత బండ్ల గణేష్ (bandla ganesh). అందుకు కారణం మెగా ఫ్యామిలీపై ఉన్న అభిమానమే అని తెలుస్తోంది.

maa elections
మా ఎన్నికలు

By

Published : Sep 5, 2021, 5:22 PM IST

ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​లోకి జీవితా రాజశేఖర్​.. రావడం తనకిష్టం లేదని తెలిపారు నిర్మాత బండ్ల గణేష్ (bandla ganesh). తనకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె గతంలో కించపరిచారని, అందుకే ప్యానెల్​ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో (maa elections) ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన బండ్ల.. ఇటీవలే ఆ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు.

బండ్ల గణేష్

"ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌లోకి జీవితా రాజశేఖర్‌ రావడం నాకిష్టం లేదు. నాకు ఎంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నో సార్లు కించపరిచారు. అందుకే నేను ఈ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నాను. ఆమెపై జనరల్‌ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నాను"

-బండ్ల గణేశ్‌, నిర్మాత

బండ్ల గణేశ్‌తో నాకు ఎలాంటి విభేదాల్లేవు: జీవితా రాజశేఖర్‌

అయితే బండ్లగణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని నటి జీవితా రాజశేఖర్‌ అన్నారు. ఈ ఏడాది జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరఫు నుంచి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీ చేస్తున్న జీవిత ఇటీవలే ఓ ఛానల్‌తో మాట్లాడారు. బండ్లగణేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.

" 'మా' అనేది అందరిది. ఇక్కడ ఎవరి మధ్య పోటీ లేదు. ప్యానల్‌లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాలి? ప్యానల్‌లో లేనివాళ్లు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులుగా ఉన్న వాళ్లు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. 'మా' అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన అందరిలో ఉంది. బండ్ల గణేశ్‌ కూడా 'మా' అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగానో, లేదా నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, లేదా ఓడినా సరే 'మా' కోసం పనిచేస్తా" అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.

అంతకుముందు తాను ఎన్నికల్లో గెలిస్తే పేద కళాకారుల కోసం పనిచేస్తానంటూ వరుస ట్వీట్లు చేస్తారు బండ్ల గణేష్.

పేద కళాకారుల కోసం పనిచేస్తా..

"మాట తప్పను .. మడమ తిప్పను. నాది ఒకటే మాట - ఒకటే బాట. నమ్మడం - నమ్మినవారి కోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తాను. ఘన విజయం సాధిస్తాను! మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియజేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే 'మా' సభ్యులు నమ్మరు. గొడవలతో 'మా' సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. 'మా'ను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు సొంతింటి కల నిజం చేద్దాం" అని బండ్ల గణేశ్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:MAA Elections: ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లోకి జీవిత, హేమ

ABOUT THE AUTHOR

...view details