ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ వరుస ట్వీట్లతో సంచలనంగా మారారు. మనస్సాక్షికి ఎంత చెప్పినా మాట వినడం లేదని, తనను పోటీచేయ్ అంటోందని అన్నారు. అందుకే పోటీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో జరగబోయే 'మా' ఎన్నికల్లో(MAA Elections) సెక్రటరీగా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
"అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా" అంటూ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్లు 'మా' ఎన్నికల్ని మరింత రంజుగా మార్చేశాయి.