తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మా' బిల్డింగ్​పై బండ్ల గణేశ్ షాకింగ్ కామెంట్స్ - బండ్ల గణేశ్ మా బిల్డింగ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీపడుతుండగా.. ప్రకాశ్​ రాజ్ ప్యానెల్​లో బండ్ల గణేశ్​ ఉన్నారు. తాజాగా బండ్ల మాట్లాడుతూ .. 'మా'కు అసలు బిల్డింగే అవసరం లేదన్నారు.

Bandla Ganesh
బండ్ల గణేశ్

By

Published : Aug 19, 2021, 3:45 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ 'మా' అధ్యక్ష ఎన్నికలు(MAA Elections) రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా 'మా' భవన నిర్మాణమే అజెండాగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం రంగంలోకి దిగారు. సినిమా బిడ్డల ప్యానల్‌ పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన ప్రకాశ్‌రాజ్‌ టీమ్‌కి నిర్మాత బండ్ల గణేశ్‌ మద్దతు తెలిపిన విషయం విదితమే. కాగా, తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మా' ఎన్నికలు, శాశ్వత భవన నిర్మాణం గురించి బండ్ల గణేశ్‌ కొన్ని షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదన్నారు.

"ప్రకాశ్‌రాజ్‌ ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలను నేను కళ్లారా చూశా. 'మా'లో కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు. 'మా'ని మరింత అభివృద్ధి చేయగలడని నాకు నమ్మకం ఉంది. అందుకే ఆయనకు నా మద్దతు ప్రకటించా. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ 'మా'కు శాశ్వత భవనం నిర్మించడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు."

"నిజం చెప్పాలంటే నేను 'మా' బిల్డింగ్‌కు వ్యతిరేకిని. ఇప్పుడు అది కట్టాల్సిన అవసరం లేదు. అసోసియేషన్‌లో సుమారు 900 మంది సభ్యులున్నారు. వారిలో దాదాపు 150 మంది వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. ఎన్నో కష్టాలు పడుతున్నారు. సరైన ఆర్థిక స్థోమతలేక ప్రతి నెలా ఎన్నో ఇబ్బందులు చవి చూస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే ఆ కిక్కే వేరే లెవల్‌లో ఉంటుంది. 'మా'కు బిల్డింగ్‌ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్‌ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు" అని బండ్ల గణేశ్‌ కామెంట్‌ చేశారు.

ఇవీ చూడండి: 'ఆర్ఆర్ఆర్​' టీమ్​ హైదరాబాద్​కు.. రిలీజ్​ చెప్పిన తేదీకేనా?

ABOUT THE AUTHOR

...view details