తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Balakrishna: శ్రీకాంత్​కు బాలయ్య 'స్వీట్​ వార్నింగ్​' - స్వీట్​ వార్నింగ్​

నటుడు శ్రీకాంత్​కు(Srikanth) స్వీట్​వార్నింగ్​ ఇచ్చినట్లు తెలిపారు హీరో బాలకృష్ణ. విలన్​ పాత్రలు చేయడం పక్కనపెట్టి ప్రధాన పాత్రలు పోషించాలని తాను సూచించినట్లు వెల్లడించారు.

srikanth
శ్రీకాంత్​

By

Published : Jun 13, 2021, 3:03 PM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న సినిమా 'అఖండ'. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటుడు శ్రీకాంత్(Srikanth)​ కనిపించనున్నారు. అయితే విలన్​ పాత్రలు చేయోద్దని శ్రీకాంత్​కు తాను సూచించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు బాలయ్య.

"ప్రతినాయకుడి పాత్రలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ఓ సందర్భంలో శ్రీకాంత్​ చెప్పాడు. అప్పుడు అతడికి ఓ స్వీట్​ వార్నింగ్​ ఇచ్చాను. పూర్తిస్థాయిలో విలన్​ పాత్రల్లో నటించవద్దని, ప్రధాన పాత్రలు మాత్రమే పోషించాలని చెప్పాను. అవసరమైతే కొన్ని మంచి కథలు, పాత్రలు కూడా సూచిస్తానని చెప్పాను" అని బాలయ్య అన్నారు.

ఇదీ చూడండి: 'ఆదిత్య 369' సీక్వెల్​తో మోక్షజ్ఞ ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details