తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్యతో సినిమా.. రాజమౌళి ఆన్సర్ ఇదే! - rajamouli keeravani Unstoppable with nbk

Balayya rajamouli movie: అభిమానుల మనసులో ఎప్పటినుంచో ఉన్న ప్రశ్నను బాలయ్య.. స్టార్ డైరెక్టర్ రాజమౌళిని అడిగారు. తమ కాంబినేషన్​లో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు ఆయన ఏం చెప్పారంటే?

balayya rajamouli
బాలయ్య రాజమౌళి

By

Published : Dec 15, 2021, 4:32 PM IST

Unstoppable with nbk promo: 'ఆర్ఆర్ఆర్' డైరెక్టర్ రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి.. నందమూరి బాలకృష్ణ అ'న్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్ షోలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు అభిమానుల్ని అలరిస్తోంది.

'మీరు ఇంటెలిజెంట్​, అచీవర్​ అని అందరికీ తెలుసు.. మరి ఎందుకు ఈ తెల్ల గడ్డం', 'మన కాంబినేషన్​లో సినిమా ఎప్పుడు?', 'మీతో సినిమా చేస్తే హీరోకు, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు. ఆ తర్వాత రెండు సినిమాలు ఫసకేగా' అని రాజమౌళిని బాలయ్య అడిగారు. దీనికి ప్రతిగా సమాధానాలన్నీ ఎపిసోడ్​లోనే చెబుతానంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే టాక్ షోలో రాజమౌళి-కీరవాణి

'అఖండ'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. బాక్సాఫీసు దుమ్మురేపారు. 10 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూళ్లు సాధించి అదరగొట్టారు. ఈ సినిమాలోని బాలయ్య ఆహార్యం, బోయపాటి డైరెక్షన్, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అభిమానుల్ని ఇప్పటికీ అలరిస్తున్నారు.

మరోవైపు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details