బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ కథానాయికలు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా వారికోసం అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
ఉగాదికి బాలయ్య-బోయపాటి మూవీ టైటిల్ - బాలయ్య బోయపాటి చిత్రం అప్డేట్
బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ను ప్రకటించేందుకు సిద్ధమైంది చిత్రబృందం.
బాలయ్య
ఈ చిత్ర టైటిల్ను ఉగాది కానుకగా ఏప్రిల్ 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో సంతోషంలో మునిగిపోయారు ఫ్యాన్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం మే 28న విడుదల కానుంది.