నందమూరి బాలకృష్ణ.. 'రూలర్' తర్వాత కొంత విరామమిచ్చాడు. తన 106వ సినిమాను బోయపాటి శ్రీనుతో చేస్తున్నట్లు ప్రకటించాడు. చిత్రీకరణకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల 15 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య మూడు గెటప్పులో కనిపిస్తాడని సమాచారం. ఇటీవల ఈ హీరో సరికొత్త లుక్లో కనిపించి అందరినీ సర్ఫ్రైజ్ చేశాడు. ప్రస్తుతం బాలయ్య మరో లుక్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
జిమ్లో కసరత్తులు చేస్తోన్న బాలకృష్ణ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఈ వీడియోలో బాలయ్య సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడు. ఈ అవతారంతో బోయపాటి ఏం ప్లాన్ చేశాడో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.