బాలకృష్ణకు పౌరాణికాలన్న, చారిత్రాత్మకమైన విషయాలు తెలుసుకోవడమన్నా, నటించడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న తెలుగు హీరోల్లో జానపదం, పౌరాణిక పాత్రలు చేయడంలో మనకు ముందుగా గుర్తొచ్చేది పేరు నందమూరి బాలకృష్ణ. ఆయన ఎప్పటినుంచో కాకతీయుల కాలంనాటి యోధుడైన గోన గన్నారెడ్డి పాత్రలో నటించాలని కోరుకునేవారు. తాజాగా ఆ పాత్రపై బాలయ్య మనసు పారేసుకున్నారట.
గోన గన్నారెడ్డి పాత్రలో బాలయ్య! - గోన గన్నారెడ్డిగా బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ మరో చారిత్రక యోధుడి కథపై మనసుపారేసుకున్నారట. కాకతీయుల కాలంనాటి గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి మొగ్గుచూపుతున్నారట. అందుకోసం ఇప్పటికే రచయితలు, కొంతమంది పరిశోధనలను కూడా ఏర్పాటు చేసుకున్నారట.
గోన గన్నారెడ్డి పాత్రలో బాలయ్య!
గన్నారెడ్డికి సంబంధించిన వివరాల కోసం కోసం రచయితలు, కొంతమంది పరిశోధకులను కూడా ఏర్పాటు చేసుకున్నారట బాలయ్య. ఇప్పటికే ఆయన అలనాటి తెలుగు పాలకుడు 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంలో నటించి మెప్పించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఈ చిత్రం అక్టోబర్ 29న తిరిగి షూటింగ్ ప్రారంభించింది.