Balayya new movie: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్.. ఇటీవల తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే నలుపు షర్ట్, బ్రౌన్ కలర్ పంచెతో ఉన్న బాలయ్య లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు తీస్తున్నారు.
#NBK 107గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్. తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యదార్థ ఘటనలు ఆధారంగా చేసుకొని ఈ పవర్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.