తెలంగాణ

telangana

ETV Bharat / sitara

NBK107: బాలయ్య కొత్త సినిమా.. పవర్​ఫుల్​ రోల్​లో విజయ్ - balayya shruthi hassan

బాలయ్య కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో కన్నడ స్టార్ నటుడు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. మరో అప్డేట్ జనవరి 5న ఉదయం 10:08 గంటలకు చెబుతామని చిత్రబృందం ట్వీట్ చేసింది.

balakrishna new movie
బాలకృష్ణ

By

Published : Jan 3, 2022, 11:11 AM IST

Balayya new movie: 'అఖండ'తో అఖండమైన విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే' టాక్​ షోతో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నారు. #NBK107 పేరుతో తెరకెక్కుతున్న కొత్త సినిమా నుంచి ఇప్పుడు రెండు అప్డేట్స్ వచ్చేశాయి.

దునియా విజయ్

బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్​లో తీస్తున్న ఈ సినిమాలోని ఓ పవర్​ఫుల్​ పాత్ర కోసం కన్నడ ప్రముఖ నటుడు దునియా విజయ్​ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పోస్టర్​ను కూడా సోమవారం రిలీజ్ చేశారు. మరి ఇతడు విలన్​గా చేస్తాడా? ఇంకేమైనా ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

శ్రుతిహాసన్ ఇందులో హీరోయిన్​గా చేస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య అఖండ మూవీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details