కరోనా కారణంగా లభించిన విరామంతో నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. అగ్ర కథానాయకులు ఒక్కొక్కరుగా రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అక్టోబరు నుంచి షురూ కానుంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయ్యింది.
అక్టోబరు నుంచి బాలయ్య షూటింగ్ షురూ! - బాలకృష్ణ కొత్త సినిమా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రానున్న చిత్రం.. అక్టోబరులో షూటింగ్ పునఃప్రారంభించుకోనుంది. ఇటీవలే విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది.
బాలకృష్ణ
ఇటీవలే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్.. అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించింది. సినిమాను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది చిత్రబృందం. 'సింహా', 'లెజెండ్' చిత్రాల తర్వాత బాలకృష్ణ - బోయపాటి కలిసి చేస్తున్న సినిమా ఇది. బాలయ్య రెండు రకాల గెటప్పుల్లో దర్శనమివ్వనున్నారు. ఒక గెటప్పులో అఘోరాగా ఆయన సందడి చేయనున్నారు. బాలకృష్ణ సరసన నటించే కథానాయిక, సినిమా పేరు విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.