నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 106వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా విడుదల చేసిన టీజర్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యానిమేటెడ్ టీజర్ ఒకటి విడుదలైంది.
బాలయ్య-బోయపాటి సినిమా యానిమేటెడ్ టీజర్ అదరహో - బాలయ్య తాజా వార్తలు
నందమూరి హీరో బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ యానిమేటెడ్ టీజర్ విడుదలై నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
బాలయ్య
ఎస్.ఆర్.ఎ1 ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన టీజర్ బాలయ్య అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో 'అందాల రాక్షసి' నటుడు నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటించనున్నారట. ఇప్పటికే చిత్రంలో శ్రీకాంత్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.