నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. లాక్డౌన్ కంటే ముందే సినిమా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవలే విడుదలైన టీజర్ అభిమానుల్లో అంచానాల్ని పెంచేసింది. కానీ మూవీ టైటిల్‌ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో నిరాశకు గురైన ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైందట చిత్రబృందం.
బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ తెలిసేది అప్పుడే! - బాలయ్య-బోయపాటి సినిమా అప్డేట్
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానుల్లో అంచనాల్ని పెంచేసింది. కానీ టైటిల్ రివీల్ చేయకపోవడం వల్ల ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైందట చిత్రబృందం.
బాలయ్య-బోయపాటి
ఈ సినిమా టైటిల్‌ను దసరా పండగ పురస్కరించుకుని ప్రకటించనున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఈ నెలలోనే షూటింగ్ తిరిగి ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో అఘోరాగా కనిపించనున్నారట.
Last Updated : Sep 14, 2020, 6:13 AM IST