నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్ర టైటిల్‌ను 'అఖండ'గా ఖరారు చేసినట్లు ఏప్రిల్ 13 ఉగాది పండగ రోజు ప్రకటించారు. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ 'అఖండ' టైటిల్ రోర్ నెట్టింట తెగ సందడి చేస్తుంది. విడుదలైన కేవలం 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని 250 (కె)లైక్స్‌తో సామాజిక మాధ్యమాల్లో నెం1 ట్రెండింగ్‌గా దూసుకెళ్తోంది.
ట్రెండింగ్‌లో బాలకృష్ణ 'అఖండ' టైటిల్ రోర్ - బాలకృష్ణ బోయపాటి అఖండ
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ' టైటిల్ రోర్.. నెట్టింట్లో నెం.1గా ట్రెండవుతోంది. విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని దుమ్మురేపుతోంది.
టీజర్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్...'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...' అంటూ ఆయన పలికిన సంభాషణ అభిమానులతో పాటు వీక్షకులను ఆకట్టుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇందులో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా సి.రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మాటలు: ఎం.రత్నం, స్టంట్‌మాస్టర్లుగా రామ్ - లక్ష్మణ్ పనిచేస్తున్నారు. మే 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: బోయపాటి సినిమాలో 'అఖండ'గా బాలయ్య