నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ'. ఇటీవల ఈ చిత్ర టైటిల్ రోర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది.
"కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తుంది. విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 12 మిలియన్ల వ్యూస్ రాగా.. ఆరు రోజుల్లో 29 మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది.
అయితే రెండు నెలల క్రితం రిలీజైన చిరు 'ఆచార్య' సినిమా టీజర్‌కు మాత్రం ఇప్పటివరకు 19 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. 'ఆర్ఆర్ఆర్' మోషన్ పోస్టర్ కూడా నెల రోజుల్లో 7 మిలియన్ల వ్యూస్‌నే దక్కించుకుంది. దీంతో బాలయ్య సినిమా రిలీజ్‌కు ముందే హవా చూపిస్తుందని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు.
ఇప్పటికే బోయపాటి-బాలయ్య కాంబోలో 'సింహా', 'లెజెండ్' వచ్చి ఘన విజయం సాధించాయి. దీంతో మూడోసారి వీరి కలయికలో వస్తున్న 'అఖండ' మీద భారీ అంచనాలు నెలకున్నాయి. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.