తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అఖండ' మేకింగ్ వీడియో.. బోయపాటి మాస్ డైరెక్షన్ - keerthy suresh good luck sakhi trailer

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అఖండ, భామ కలాపం, జెంటిల్మన్ 2, మళ్లీ మొదలైంది చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

akhanda movie making video
అఖండ మేకింగ్ వీడియో

By

Published : Jan 23, 2022, 5:07 PM IST

Updated : Jan 23, 2022, 5:34 PM IST

Akhanda Making Video: మొన్నటివరకు థియేటర్లలో సందడి చేసిన బాలయ్య 'అఖండ'.. ఇప్పుడు ఓటీటీలో రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే సినిమా మేకింగ్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు.

ఇందులో బాలయ్య.. 'అఖండ'గా ఎలా మారారు? బోయపాటి ఎలా యాక్షన్ చేసి చూపించారు? తదితర విషయాల్ని ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా, అందులో ఒకటి అఘోరా పాత్ర. తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది.

Priyamani bhama kalapam movie: ప్రియమణి ప్రధాన పాత్రలో నటించి వెబ్ మూవీ 'భామా కలాపం'. ఈ చిత్ర టీజర్​ను స్టార్ హీరోయిన్ రష్మిక రిలీజ్ చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ టీజర్​ హాస్యభరితంగా సాగుతూ అలరిస్తోంది.

ఓ అపార్ట్​మెంట్​లో ఉండే అనుపమ అనే గృహిణి పాత్రలో ప్రియమణి నటించింది. అపార్ట్​మెంట్​లోని అందరి ఇళ్లలో జరిగే విషయాలు తెలుసుకునే అనుపమ.. ఓ మర్డర్​ను చూస్తుంది. ఆ తర్వాత ఎదురైన పరిణామాలేంటి అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 11న 'భామా కలాపం' రిలీజ్ కానుంది.

Malli modalaindi movie OTT: సుమంత్ హీరోగా నటిస్తున్న 'మళ్లీ మొదలైంది' ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 11న నేరుగా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

సుమంత్ మళ్లీ మొదలైంది మూవీ ఓటీటీ

ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్​గా చేసింది. పెళ్లయిన జంట మధ్య వచ్చే మనస్పర్థల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.

MM Keeravani news: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి క్రేజీ ఛాన్స్ దక్కించుకున్నారు. 'జెంటిల్మన్ 2' చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు. నిర్మాత కేటీ కుంజమున్, ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు.

నిర్మాత కుంజమున్​తో కీరవాణి

'ప్రేమికుడు', 'ప్రేమదేశం' లాంటి సినిమాలు నిర్మించిన కుంజమున్.. 1999 తర్వాత నిర్మాతగా చిత్రాలు తీయలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'జెంటిల్మన్' సీక్వెల్​ను ఇటీవల ప్రకటించారు. త్వరలో నటీనటులతో పాటు ఇతర వివరాలు ప్రకటించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

Last Updated : Jan 23, 2022, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details