Balayya akhanda movie: నందమూరి బాలయ్య 'అఖండ' సినిమా అద్భుతం చేసింది. కరోనా రెండో దశ ప్రభావం, టిక్కెట్ రేట్ల వివాదం, షోల తగ్గింపు ఇలా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొని అత్యంత విజయవంతంగా 50వ రోజులోకి అడుగుపెట్టింది. 103 కేంద్రాల్లో ఈ మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం ఈ ఘనత సాధించడమనేది గొప్ప విషయమనే చెప్పాలి.
ఎందుకంటే కరోనా మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడినట్లుగానే సినిమాలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని నెలల పాటు థియేటర్లు మూసివేశారు. ఆ తర్వాత వాటిని తెరిచినప్పటికీ ప్రేక్షకులు రావడం మాత్రం తగ్గిపోయింది. ఇలాంటి టైమ్‌లో వచ్చిన 'అఖండ'.. థియేటర్లలో ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించింది.