తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ బయోపిక్​కు నో చెప్పిన బాలయ్య! - జయలలిత బయోపిక్​కు నో చెప్పిన బాలయ్య

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్రలో నటించేందుకు బాలకృష్ణను సంప్రదించిందట చిత్రబృందం. కానీ బాలయ్య ఈ సినిమాకు నో చెప్పాడని సమాచారం.

బాలయ్య
బాలయ్య

By

Published : Mar 31, 2020, 11:21 AM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు'. ఈ సినిమాలకు క్రిష్ దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఎన్టీఆర్ పాత్రలో కనువిందు చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అందుకేనేమో మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించాలని బాలయ్యకు ఆఫర్​ వచ్చినా తిరస్కరించాడని సమాచారం.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా, తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ 'తలైవి' అనే టైటిల్​తో ఓ బయోపిక్​ను తెరకెక్కిస్తున్నాడు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్రలో నటించడానికి బాలయ్యనే ఒప్పించాలని చిత్రబృందం భావించింది. ఎందుకంటే, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో విష్ణు ఇందూరి కూడా ఒకరు. ఇప్పుడు అతడు నిర్మిస్తోన్న అమ్మ బయోపిక్​లో ఎన్టీఆర్ పాత్ర ఉండటం, ఆ పాత్రలో బాలయ్య అయితేనే బాగుంటుందని అనుకుని అతడిని సంప్రదించడం జరిగాయట. కానీ బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఫలితంగా చేసేదేమీ లేక ఎన్టీఆర్ పాత్రను సినిమాలో నుంచి తొలిగించినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ పాత్రను నిజంగానే తొలిగించారా లేక వేరే ఎవరి చేతైనా నటింపజేస్తున్నారా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడక తప్పదు.

ABOUT THE AUTHOR

...view details