తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డిఫరెంట్​ టైటిల్​తో బాలకృష్ణ సినిమా - వి వి వినాయక్

ఎన్టీఆర్​ బయోపిక్​ తర్వాత కొంత విరామం తీసుకున్న బాలకృష్ణ.. కొత్త సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. కేఎస్ రవికుమార్ దర్శకుడు. వచ్చే నెల నుంచి షూటింగ్​ మొదలు కానుంది.

కాస్త డిఫరెంట్​ టైటిల్​తో బాలకృష్ణ సినిమా

By

Published : Jun 13, 2019, 6:23 PM IST

టాలీవుడ్​ హీరో బాలకృష్ణ కొత్త సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమానికి దర్శకులు వి.వి.వినాయక్, కోదండరామిరెడ్డి, బోయపాటి శ్రీను హాజరయ్యారు. కేఎస్ రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

బాలకృష్ణ కొత్త సినిమా పూజా కార్యక్రమం

ఈ దర్శకుడితో ఇంతకుముందే 'జై సింహా' సినిమాలో నటించారు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'క్రాంతి' అనే వినూత్న టైటిల్​ పెట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్​గా కనిపించనున్నాడని సమాచారం. వచ్చే నెల నుంచి షూటింగ్​ మొదలుకానుంది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేసే అవకాశముంది.

బాలకృష్ణ జన్మదినం రోజున విడుదలైన పోస్టర్

ఇది చదవండి: పోరాటాల 'సాహో'- అదరగొట్టిన ప్రభాస్​

ABOUT THE AUTHOR

...view details