తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ విడుదల తేదీపై బాలకృష్ణ కన్ను..!

రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల తేదినే నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమాను విడుదల చేయనున్నాడట. జక్కన్న తన చిత్రాన్ని ఏ రోజైతే విడుదల చేయనున్నట్లు ప్రకటించాడో.. అదే రోజున బాలయ్య కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Balakrishna's new movie will be released in july 30,2020..?
'ఆర్​ఆర్​ఆర్'​ చిత్ర విడుదల తేదీపై బోయపాటి కన్ను

By

Published : Jan 20, 2020, 5:29 PM IST

Updated : Feb 17, 2020, 6:04 PM IST

'ఆర్​ఆర్​ఆర్' చిత్రాన్ని జులై 30నవిడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా ఆ చిత్ర విడుదల తేదీ వాయిదా పడుతున్నట్లు బలమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో బోయపాటి-బాలయ్య కలయికలో వచ్చే కొత్త సినిమాను ఆరోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారట.

ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైనా .. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్​ జరుపుకోనుంది. ఈ సినిమాను వేసవి కల్లా పూర్తి చేసి జులై నెలలో విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఈ వార్తల్లో నిజం తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. 'ఆర్​ఆర్​ఆర్​' ప్రకటించిన విడుదల తేదీపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ తేదీని తమ సినిమా విడుదలకు వాడుకుంటే కలిసొస్తుందని బోయపాటి ఆలోచన. ఒకవేళ ఇదే నిజమైతే.. జులై 30న యంగ్‌టైగర్‌ను తెరపై చూడలేకపోయినా.. నందమూరి నట సింహాన్ని తెరపై చూసుకునే భాగ్యం సినీప్రియులకు కలుగుతుంది. 'సింహా', 'లెజెండ్‌' హిట్‌ చిత్రాల తర్వాత బోయపాటి - బాలకృష్ణల కలయికలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం కావడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి:- 'ఈ సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది'

Last Updated : Feb 17, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details