తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Akhanda Movie: చారిత్రక ప్రదేశాల్లో షూటింగ్​!​ - గండికోటలో అఖండ

కరోనా రెండో దశ తగ్గుముఖం పడటం వల్ల తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా చిత్రీకరణలు పునఃప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా హీరో బాలకృష్ణ(Balakrishna Akhanda) నటిస్తున్న 'అఖండ' చిత్రానికి సంబంధించిన మిగిలిన షూటింగ్​ జులై తొలి వారం నుంచి షురూ కానుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్​లోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశాల్లో చిత్రీకరించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Balakrishna's Akhanda to be shot at historic places in Andhra Pradesh
Akhanda Movie: చరిత్రాత్మక ప్రదేశాల్లో షూటింగ్​!​

By

Published : Jun 29, 2021, 5:01 PM IST

టాలీవుడ్​లో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం 'అఖండ'. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రగ్యా జైస్వాల్‌ నాయిక. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ జులై నుంచి పునః ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని గండికోట, కడప, చిత్తూరులోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది. బాలకృష్ణతోపాటు ఇతర ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం చిత్ర బృందం లొకేషన్లను పరిశీలిస్తోంది. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 'సింహా', 'లెజెండ్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వస్తుండటం వల్ల 'అఖండ'పై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి.

ఇదీ చూడండి..Balakrishna: 'అఖండ'.. జులై నుంచి హైదరాబాద్​లో!

ABOUT THE AUTHOR

...view details