తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రికార్డు స్థాయి బిజినెస్​తో బాలయ్య 'అఖండ​'! - బాలకృష్ణ అఖండ ప్రీరిలీజ్​ బిజినెస్

నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం 'అఖండ'. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్​తో సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్​ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్​, డిజిటల్​ హక్కులను రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

Balakrishna's Akhanda setting record pre-release business
బాలయ్య 'అఖండ' సినిమా హక్కులకు రికార్డు ధర​!

By

Published : May 23, 2021, 9:10 PM IST

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ- మాస్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను కాంబినేషన్​లో రూపొందుతోన్న మూడో చిత్రం 'అఖండ'. వీరిద్దరూ కలిసి గతంలో పనిచేసిన చిత్రాలు 'సింహా', 'లెజెండ్​' బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమైన 'అఖండ'పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్​కూ విశేషస్పందన వస్తోంది. యూట్యూబ్​లో వేగంగా 50 మిలియన్ల వీక్షణలు దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్​ చేసింది.

'అఖండ' చిత్ర టీజర్​ తెచ్చిన క్రేజ్​కు ఈ సినిమా థియేట్రికల్​, డిజిటల్​ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా 80 నుంచి 90 కోట్ల రూపాయలకు మేర ప్రీ-రిలీజ్​ బిజినెస్​ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇదే నిజమైతే బాలయ్య కెరీర్​లోనే అత్యధికంగా ప్రీ-రిలీజ్​ బిజినెస్​ చేసిన చిత్రమిదే కాబోతోంది.

మే 28న సినిమా విడుదల కావాల్సినప్పటికీ, కరోనా సెకండ్​ వేవ్ ప్రభావంతో షూటింగ్​ ఆగిపోయింది. థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఇంకా 20 రోజుల షూటింగ్​ మిగిలుందని హీరోయిన్​ ప్రగ్యా జైస్వాల్​ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి..సినీ​ ప్రొడక్షన్​ మహిళల​కు అలీ దంపతుల సాయం

ABOUT THE AUTHOR

...view details