నందమూరి హీరో బాలకృష్ణ మరో కొత్త సినిమా(Balakrishna new movie) చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త కథతో సితార సంస్థ(sitara entertainments movies) ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం పక్కా పల్లెటూరి బ్యాక్డ్రాప్లో ఉంటుందని.. ఇందులో బాలయ్య (balakrishna latest movie updates) ఎమోషనల్ పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీని కోసం చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా బాలయ్య, సితార సంస్థ కాంబినేషన్లో కొత్త తరహా సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
బడా బ్యానర్లో బాలయ్య చిత్రం.. విభిన్న కథతో! - sitara entertainments movies list
వరుసగా యాక్షన్ చిత్రాలు చేస్తున్న నటసింహం బాలకృష్ణ (Balakrishna new movie).. ఈసారి కొత్త తరహా కథతో రానున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments movies)ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం.
![బడా బ్యానర్లో బాలయ్య చిత్రం.. విభిన్న కథతో! Balakrishna new movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13046880-thumbnail-3x2-ram.jpg)
బాలయ్య బాబు కొత్త సినిమా
ప్రస్తుతం.. బాలయ్య చేస్తున్న 'అఖండ' (Balakrishna Akhanda movie release date) సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. విజయవంతమైన 'సింహా', 'లెజెండ్' తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ఆయనకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.
ఇదీ చూడండి:చూపులతో కట్టిపడేస్తున్న 'కర్ణన్' బ్యూటీ