తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు-మోహన్ బాబు మధ్య అసలు ఇష్యూ ఇదే.. తేల్చేసిన బాలయ్య! - బాలకృష్ణ టాక్ షో

బాలయ్య 'అన్​స్టాపబుల్' టాక్​ షో తొలి ఎపిసోడ్​ ప్రోమో వచ్చేసింది. మోహన్​బాబు గెస్ట్​గా విచ్చేసి, పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

balakrishna Unstoppable Episode 1 Promo
బాలయ్య

By

Published : Oct 31, 2021, 11:56 AM IST

నందమూరి బాలకృష్ణ 'అన్​స్టాపబుల్' తొలి ఎపిసోడ్​ ప్రోమో వచ్చింది. సీనియర్ నటుడు మోహన్​బాబు విచ్చేసి, హోస్ట్​ బాలయ్యతో కలిసి తెగ సందడి చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు మోహన్​బాబు పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

"నేను మీకు తెలుసు. నా స్థానం మీ మనసు" అని చెప్పిన బాలయ్య డైలాగ్​తో ప్రోమో మొదలైంది. "ఎవరి జీవితం కళా ప్రపూర్ణమో, ప్రజాసేవ సంపూర్ణమో ఆయనే" అని బాలకృష్ణ డైలాగ్​ చెప్పే సమయానికి మోహన్​బాబు ఎంట్రీ ఇచ్చారు.

బాలయ్య

మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది అని మోహన్​బాబును బాలయ్య అడిగారు. 'పటాలం పాండు' అని మోహన్​బాబు సమధానమిచ్చారు. "చిరంజీవి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయమేంటి?" అని బాలయ్య, మోహన్​బాబును అడిగారు. "ఆయన అన్ని చూస్తుంటారు. నేను మాత్రం.. " అంటూ మోహన్​బాబు చెప్పారు. దీని బట్టి ఏదో ఆసక్తికర విషయం ఎపిసోడ్​లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

"హీరోగా నిలబడాలనే ప్రయత్నంలో విఫలమవుతున్న రోజుల్లో ఎప్పుడైనా బాధపడ్డారా?" అని బాలయ్య అడగ్గా.. "తలుచుకుంటే ఏడుపొస్తుంది సోదరా.. పిల్లల కోసం చేస్తున్నాను. ఇల్లు అమ్మేశాను. ఎవరూ హెల్ప్ చేయలేదు" అని అన్నారు.

చివర్లో మోహన్​బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు కూడా వచ్చి షోలో సందడి చేశారు. 'జై బాలయ్య' అని అన్న లక్ష్మీ.. బాలయ్య అభిమానుల్లో జోష్ తెప్పించింది.

ABOUT THE AUTHOR

...view details