నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. చిత్రానికి సంబంధించి దర్శకుడు పనులు మొదలుపెట్టారు. ఇందులో నాయికగా స్టార్ హీరోయిన్ త్రిషను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమా కోసం గోపీచంద్.. త్రిషను సంప్రదించారని, అందుకు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెప్పుకొంటున్నారు.
బాలయ్యకు హీరోయిన్గా '96' బ్యూటీ! - బాలకృష్ణ గోపీచంద్ మలినేని
బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
బాలయ్యకు హీరోయిన్గా '96' బ్యూటీ!
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చేస్తున్నారు. కరోనా కారణంగా మే 28న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడంది. దీంతో ఈ సినిమాను దసరా నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అప్పుడే కొత్త చిత్రాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి..'వివాహ భోజనంబు' పెళ్లి పాట.. 'క్యాబ్ స్టోరీస్' టీజర్