గత కొంతకాలంగా సీనియర్ దర్శకులతో సినిమాలు చేస్తూ వస్తున్న నందమూరి బాలకృష్ణ.. యువదర్శకుడు అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో కలిసి పనిచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ విషయంపై స్పష్టత రానుంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత బి.గోపాల్‌తో కలిసిపనిచేయనున్నాడు. మరోవైపు సరిలేరు నీకెవ్వరు అంటూ వచ్చిన్ అనిల్.. 'ఎఫ్2'కు సీక్వెల్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్లీ మహేశ్‌తో సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతే అనిల్-బాలకృష్ణ చిత్రం పట్టాలెక్కనుందట.