నందమూరి బాలకృష్ణ(balakrishna movies).. 'లైగర్'(liger movie) టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అక్కడికి వెళ్లిన ఆయన చిత్రబృందంతో కలిసి ముచ్చటించారు. అలానే సినిమా విజయం సాధించాలని ఆశీర్వదించారు. 'లైయన్ విత్ లైగర్' అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాక్సర్‌గా విజయ్
మార్షల్ ఆర్ట్స్ కథతో తీస్తున్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ(vijay devarakonda movies) బాక్సర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరిగింది. ఇటీవల గోవాలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బాలయ్య సెట్లో సందడి చేయడం.. 'లైగర్' టీమ్‌లో జోష్ నింపింది.