తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నదెవరో తెలుసా..! - బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తర్వాతి చిత్రంలో టాలీవుడ్​కు చెందిన ఓ కమెడియన్​ కీలకపాత్ర పోషించనున్నాడని సమాచారం. బోయపాటి తనదైన మార్క్​ కామెడీని ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

balakrishna-sunil-nbk-106-boyapati-srinu
బాలయ్యతో కీలకపాత్ర పోషిస్తున్న నటుడెవరో తెలుసా..!

By

Published : Jan 28, 2020, 5:48 AM IST

Updated : Feb 28, 2020, 5:38 AM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక పాత్రపై టాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. అదేంటంటే? హీరో స్నేహితుడి పాత్ర. తన కామెడీతో నవ్వుల పువ్వులు పూయించే సునీల్‌.. బాలయ్యకు స్నేహితుడిగా ఈ మూవీలో నటించనున్నాడని సమాచారం. ఇది కీలకమైన పాత్రని.. కామెడీ ఎక్కువ ప్రదర్శించే అవకాశం ఉండటం వల్ల సునీల్‌ని ఎంపిక చేయనున్నారని టాక్‌.

బాలకృష్ణ, సునీల్​

ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్‌ మీద దృష్టిపెట్టిన బోయపాటి.. ఈసారి కామెడీ ట్రాక్‌ను నడిపించబోతున్నాడని సమాచారం. బాలయ్య మిత్రుడిగా సునీల్‌ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించేందుకు కథానాయికను అన్వేషించే పనిలో ఉంది చిత్రబృందం. ఫిబ్రవరి 15 నుంచి చిత్రీకరణ ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి..చిన్నారుల ఆవేదన విని సూర్య కన్నీళ్లు

Last Updated : Feb 28, 2020, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details