తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్లైమాక్స్ షూటింగ్​లో బాలయ్య 'అఖండ' - బాలకృష్ణ బోయపాటి

నందమూరి హీరో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతోన్న చిత్రం అఖండ. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుపుకొంటోంది.

Balakrishna
బాలయ్య

By

Published : Jul 23, 2021, 5:08 PM IST

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అఖండ'లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకుడు. ప్రస్తుతం తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకొంటోందీ సినిమా. శుక్రవారం దీనికి సంబంధించిన షూట్‌ షురూ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ ఫొటోని అందరితో పంచుకుంది. ఇందులో బాలయ్యకు సీన్‌ వివరిస్తూ బోయపాటి కనిపించారు. స్టంట్‌ మాస్టర్‌ శివ నేతృత్వంలో జరగనున్న ఈ షూట్‌లో సినిమాలోని కీలక పాత్రధారులందరూ పాల్గొననున్నారు.

'సింహా', 'లెజెండ్‌' చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన వేరియేషన్స్‌లో కనిపించనున్నారు.

ఇవీ చూడండి: Raj Kundra: పోర్న్ ద్వారా వచ్చిన లాభాలు బెట్టింగు​ల్లో!

ABOUT THE AUTHOR

...view details