శుక్రవారం(మే 28) లెజండరీ నటుడు ఎన్టీఆర్ జయంతి (NTR Birthday) సందర్భంగా అభిమానులకు బాలకృష్ణ (Balakrishna) సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. అయితే ఇది సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం కాదు. ఆయన స్వయంగా పాడిన 'శ్రీరామ దండకం' పాటను శుక్రవారం ఉదయం 9.45 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇప్పటికే 'శివ శంకరీ' అనే పాటను ఆలపించి నందమూరి అభిమానులను ఖుషీ చేశారు బాలయ్య. ఈసారి 'శ్రీరామ దండకం'తో ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.