తెలంగాణ

telangana

ETV Bharat / sitara

NTR Jayanthi: బాలయ్య 'శ్రీరామ దండకం' రిలీజ్ - Balakrishna Sri Rama Dhandakam released'

నట సౌర్వభౌముడు ఎన్టీఆర్ 98వ జయంతి (NTR Jayanthi) సందర్భంగా అభిమానులకు ఓ కానుక అందించారు బాలకృష్ణ. ఆయన స్వయంగా పాడిన శ్రీరామ దండకాన్ని విడుదల చేశారు.

balayya
బాలయ్య

By

Published : May 28, 2021, 9:47 AM IST

Updated : May 28, 2021, 10:00 AM IST

నేడు(మే 28) లెజండరీ నటుడు ఎన్టీఆర్​ 98వ జయంతి (NTR jayanthi) సందర్భంగా అభిమానులకు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఓ కానుక అందించారు. ఆయనే స్వయంగా పాడిన 'శ్రీరామ దండకం' పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు.

ఇప్పటికే తన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బాలయ్య. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన 'పైసా వసూల్' చిత్రంలో 'మామా ఏక్ పెగ్​ లా' అంటూ ఓ మాస్ పాట పాడారు. అలాగే సీనియర్​ ఎన్టీఆర్​ నటించిన 'జగదేక వీరుని కథ' చిత్రంలోని 'శివ శంకరీ' (Shiva Shankari by Balakrishna) పాటను బాలయ్య స్వయంగా ఆలపించారు. ఆ సినిమాలోని వీడియోకు తన గాత్రాన్ని కలిపి విడుదల చేశారు. ఇది కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ (Akhanda) చిత్రం తెరకెక్కుతోంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం కావడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్(Akhanda teaser) అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

ఇవీ చూడండి: ఎన్టీఆర్​ కోరికతో పట్టాలెక్కిన శ్రీనాథుడి కథ!

NTR :సినిమానే దేవాలయం.. ప్రేక్షకులే దేవుళ్లు

Last Updated : May 28, 2021, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details