తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య-పూరి కాంబినేషన్​లో మరో చిత్రం - Balakrishna-Puri Jagannath movie updates

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్వరలోనే మరో సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పూరి ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

పూరి
పూరి

By

Published : Apr 21, 2020, 8:20 PM IST

వరుస పరాజయాలకు చెక్‌ పెడుతూ.. 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రంతో జబర్దస్త్‌ విజయాన్ని ఖాతాలో వేసుకొని మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కేశారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇప్పుడీ జోష్‌లోనే విజయ్‌ దేవరకొండతో 'ఫైటర్‌'ను ఫటాఫట్‌ లాగించేస్తున్నారు. ఇప్పటికే 40శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం కరోనా వల్ల తాత్కాలికంగా ఆగింది. అయితే ఇప్పుడీ విరామ సమయంలో తన భవిష్యత్‌ కార్యాచరణ కోసం చక్కగా ప్లాన్‌ చేసుకుంటున్నారట పూరి.

ఇప్పటివరకు చిత్రీకరించిన 'ఫైటర్‌' సన్నివేశాలను ఎడిట్‌ చేసుకుంటూనే.. తన తర్వాతి చిత్రం కోసం కథను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారట పూరి. అంతే కాదండోయ్‌.. ఇక్కడ మరో విశేషమూ ఉంది. ఇంతకీ ఆయన కథ సిద్ధం చేసుకుంటోంది మరెవరి కోసమో కాదట.. నందమూరి బాలకృష్ణ చిత్రం కోసం. ప్రస్తుతం చిత్రసీమ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఆయన తన తర్వాతి చిత్రాన్ని బాలయ్యతో చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో బాలయ్య-పూరి కలయికలో వచ్చిన 'పైసా వసూల్‌' బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆదరణనే దక్కించుకుంది. ముఖ్యంగా బాలయ్యను పూరి తనదైన మేకింగ్‌ స్టైల్‌లో చూపించిన విధానం నందమూరి అభిమానులకు భలే కిక్‌నిచ్చింది. అందుకే బాలకృష్ణ కూడా మళ్లీ పూరితో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details