నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో మూడోసారి పనిచేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో 'సింహా', 'లెజెండ్' చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు రాబోతున్న సినిమాలో బాలయ్య సరికొత్తగా కనిపించనున్నాడని టాక్. అందులో భాగంగానే షూటింగ్ ప్రారంభానికి ఆలస్యమైందని టాక్. ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లేందుకు అంతా సిద్ధమైందట. ఈనెల 26 నుంచి చిత్రీకరణ మొదలుకానుందట.
ఈ నెలాఖరు నుంచి సెట్స్‌పైకి బాలయ్య సినిమా - tollywood news
హీరో బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్.. ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుందని టాక్.
హీరో బాలకృష్ణ
ఇందులో హీరోయిన్లుగా నయనతార, శ్రియ, నమితల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా 'రేసుగుర్రం' నటి కేథరిన్ పేరు కూడా చేరింది. తమన్ సంగీతమందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. జులైలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Last Updated : Feb 29, 2020, 5:15 PM IST