Balyya new movie: నందమూరి బాలకృష్ణ 107వ సినిమా ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే షూటింగ్ సన్నాహాలు మొదలుకానున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శ్రుతిహాసన్ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
బాలకృష్ణ కొత్త సినిమా.. తొలి అడుగు ఇక్కడే! - balayya unstoppable
NBK 107: బాలయ్య కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఇక్కడే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కానీ విదేశాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారని సమాచారం.
బాలకృష్ణ గోపీచంద్ మూవీ
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలోని కీలకమైన సీన్లన్నీ విదేశాల్లోనూ తెరకెక్కించనున్నట్టు సమాచారం. తొలి సన్నివేశాల్ని మాత్రం తెలంగాణలోని సిరిసిల్లలో తీయాలని చిత్రబృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. 'క్రాక్'తో విజయాన్ని అందుకున్న గోపీచంద్.. మరో శక్తివంతమైన కథతో బాలకృష్ణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇవీ చదవండి: