నందమూరి నటసింహం బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. స్టైలిష్ లుక్‌లో నందమూరి హీరో అదరగొడుతున్నాడు.
ఈ సినిమా రెండో షెడ్యూల్ సెప్టెంబర్ 5న ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామని తెలిపింది. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు. భూమిక కీలకపాత్రలో కనిపించనుంది.