నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా 'రూలర్'. పోలీస్ గెటప్‌లో ఉన్న బాలయ్య ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇప్పుడు స్టైలిష్‌గా ఉన్న ఈ కథానాయకుడి కొత్త ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇందులో యంగ్‌గా కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. త్వరలో టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించారు.
'రూలర్'లో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. పోలీస్ అధికారిగా, ఐటీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేరళలో బాలకృష్ణ - వేదికలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్గా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు.