నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ఆయన కొత్త సినిమాపై ప్రకటన వచ్చేసింది. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య పూర్తిగా కొత్త లుక్లో కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొన్నిరోజుల్లో వెల్లడించే అవకాశముంది.
balakrishna new movie: త్వరలో బాలయ్య వేట షురూ - balakrishna gopichand malineni movie
అగ్రకథానాయకుడు బాలకృష్ణ కొత్త చిత్రంపై స్పష్టత వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.
బాలకృష్ణ
'క్రాక్'తో హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుందీ సినిమా. ప్రస్తుతం 'అఖండ'తో బిజీగా ఉన్నారు బాలకృష్ణ.
ఇవీ చదవండి: