తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బీబీ3 అప్​డేట్​: కలెక్టర్​తో బాలయ్య ప్రేమాయణం! - ప్రగ్యా జైస్వాల్ వార్తలు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'బీబీ3' (వర్కింగ్​ టైటిల్​) చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రగ్యా జైశ్వాల్​ జిల్లా కలెక్టర్​ పాత్ర పోషిస్తుందని సమాచారం. అయితే సినిమాలో బాలయ్య పాత్రతో ఆమె లవ్​లో పడుతుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

BalaKrishna, pragya jaiswal in bb3
బీబీ3 అప్​డేట్

By

Published : Mar 29, 2021, 4:52 PM IST

Updated : Mar 29, 2021, 6:08 PM IST

నటసింహం బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాయికగా ప్రగ్యా జైశ్వాల్​ నటిస్తోంది. హీరోయిన్​ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్​ టాలీవుడ్​లో చక్కర్లు కొడుతోంది. ప్రగ్యా.. యంగ్​ కలెక్టర్​ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సినిమాలో బాలయ్య పాత్ర చేసే మంచి పనులకు ఆమె లవ్​లో పడుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వేచిచూడాల్సిందే.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో నటి పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందట. అయితే ఆమె పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాలీవుడ్‌ టాక్‌. హీరో శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించనున్నారు. చిత్రానికి 'గాడ్‌ ఫాదర్‌' అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తుంది.

ఈ సినిమాకు తమన్‌ సంగీత స్వరాలు అందిస్తుండగా రామ్ ప్రసాద్‌ ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ ఏడాది మే 28న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదీ చూడండి:'సుల్తాన్​'లో అసలు విలన్​ ఎవరన్నదే ట్విస్టు!

Last Updated : Mar 29, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details