టాలీవుడ్ హీరో బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్శనివారం థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. థాయ్‌లాండ్‌లో భారీ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదికను హీరోయిన్లుగా ఎంపిక చేసింది చిత్రబృందం. భూమిక చావ్లా కీలక పాత్రలో కనిపించనుంది. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే దర్శకుడితో ఇంతకుముందు 'జై సింహా' సినిమాలో నటించాడు బాలకృష్ణ. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.