నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు బాలయ్య మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మరోసారి బాలయ్యతో పూరీ జగన్నాథ్! - బాలయ్య తరువాత సినిమా ఫిక్స్
నందమూరి నటసింహం బాలయ్య మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట.
![మరోసారి బాలయ్యతో పూరీ జగన్నాథ్! Balakrishna Green signal to Puri jagannath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9312375-184-9312375-1603677111597.jpg)
మరోసారి బాలయ్యతో పూరి జగన్నాథ్!
పూరీ చెప్పిన కథ బాలయ్యకు నచ్చిందట. దీంతో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారట. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'పైసా వసూల్' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపించి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు పూరీ. మరి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో మరోసారి బాలయ్యను ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Last Updated : Oct 26, 2020, 3:29 PM IST