ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తయ్యాక బి.గోపాల్‌తో మరో చిత్రం చేస్తున్నారని గతంలో వార్తలొచ్చాయి. అధికారికంగా వెల్లడించలేదు. ఇదిలా ఉండగానే బాలయ్య మరో కథకి ఓకే చెప్పారని టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది.
మరో కథకి బాలయ్య సిద్ధమయ్యారా? - బాలకృష్ణ కొత్త చిత్రం
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉండగానే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
మరో కథకి బాలయ్య సిద్ధమయ్యారా?
ప్రముఖ రచయిత ఎం. రత్నం బాలయ్య కోసం అదిరిపోయే స్క్రిప్టు రాశారని, ఇటీవలే ఇద్దరి మధ్య చర్చలు సాగాయని సినీ వర్గాల సమాచారం. ఈ కథకు బాలయ్య ఆసక్తి చూపుతున్నారట. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గతంలో బాలయ్య హీరోగా వచ్చిన 'జై సింహా' సినిమాకు కథ, సంభాషణలు అందించారు ఎం.రత్నం. ఈ సారి ఎలాంటి ఆసక్తికర కథాంశంతో వస్తారో చూడాలి.