ఇటీవలే 'అఖండ'(balakrishna akhanda movie release date) సినిమాను పూర్తి చేసిన బాలకృష్ణ.. ఇప్పుడు గోపీచంద్ మలినేని(balakrishna gopichand malineni) చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటిస్తున్న 107వ చిత్రం. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తమన్ స్వరాలందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపొందనుంది(balakrishna new movie).
ఇప్పుడీ చిత్రం కోసం 'జై బాలయ్య'(jai balayya) అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, నవంబరులో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిసింది. అప్పుడే టైటిల్ అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం వినిపిస్తోంది.