తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జయహో అఖండ... అభిమానుల పూనకాలతో థియేటర్లు ఊగిపోతున్నాయ్! - విదేశాల్లో బాలకృష్ణ అభిమానుల సంబురాలు

Akhanda Movie Celebrations : బాలకృష్ణ-బోయపాటి.. వీళ్ల కాంబోలో సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ప్రేక్షకులు ఈలవేసి గోల చేయాల్సిందే. వీరికి తోడు థమన్​ కలిస్తే.. ఇంకేముంది.. అదిరిపోయే బీజీఎంలో.. అదరగొట్టే బాలయ్యబాబు ఫైట్​లు.. ఆహా.. సగటు మాస్ ప్రేక్షకుడికి ఇంతకంటే కావాల్సిందేముంది. అఖండ సినిమాతో బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ కొట్టారు. వీరి కాంబోను ఇష్టపడే వాళ్లంతా థియేటర్లలో సంబురాలు చేసుకుంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల అభిమానులే కాదు.. విదేశాల్లో ఉన్న బాలకృష్ణ అభిమానులు అఖండ సినిమా చూసి అదిరిపోయే రివ్యూలిస్తున్నారు. ధూంధాంగా సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థియేటర్లన్నీ జైబాలయ్య అనే నినాదాలతో దద్దరిల్లుతున్నాయి.

balakrishna-fans-celebrates-akhanda-movie-success
balakrishna-fans-celebrates-akhanda-movie-success

By

Published : Dec 2, 2021, 12:27 PM IST

Updated : Dec 2, 2021, 12:35 PM IST

బాలయ్య ఫ్యాన్స్ రచ్చ

Akhanda Movie Celebrations : ఆటంబాంబ్​ లాంటి బాలకృష్ణ.. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి.. అదరగొట్టే బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ఇచ్చే థమన్.. ముగ్గురు కలిస్తే ఇక థియేటర్లు బద్ధలే. ప్రేక్షకులకు పండగే. అందుకే అఖండ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు నీరాజనం పడుతున్నారు. థియేటర్లన్నీ అభిమానుల సందడితో దద్దరిల్లుతున్నాయి. అఖండ సినిమా వీక్షిస్తున్నంత సేపు ఒక్క ప్రేక్షకుడు కూడా సీట్​లో కూర్చోలేదు. అంతగా ఈ సినిమా వీక్షకులను అలరించింది. ఈలలు, గోలలతో థియేటర్లన్ని కోలాహలంగా మారాయి.

BalaKrishna Fans celebrations : బెన్​ఫిట్ షో, ప్రీమియర్ షో, మార్నింగ్ షోలలో అఖండ సినిమాకు వస్తోన్న రివ్యూలు చూస్తే బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ కొట్టినట్లే కనిపిస్తోంది. మరోవైపు థియేటర్లలో అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. అఖండ సినిమా హవా.. బాలయ్య బాబు క్రేజ్.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికా, లండన్ వంటి విదేశాల్లోనూ ఉంది. అక్కడి బాలకృష్ణ అభిమానులు నినాదాలతో థియేటర్లను హోరెత్తిస్తున్నారు.

BalaKrishna fans in US : జై బాలయ్య.. జైజై బాలయ్య, కోకోకోలా పెప్సీ.. బాలయ్యబాబు సెక్సీ, అడుగడుగో బాలయ్య.. ఇడిగిడుగో బాలయ్య, ఆహా బాలయ్య.. ఓహో బాలయ్య అంటూ నినాదాలతో లెజెండ్ అభిమానులు థియేటర్లను దద్దరిల్లిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టపాసులు పేలుస్తూ అఖండ విజయాన్ని ఆకాశన్నంటేలా సంబురాలు చేసుకుంటున్నారు. వీరి సందడి చూసిన వాళ్లంతా.. వీలైనంత త్వరగా సినిమా చూసేయాలని థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అఖండ రివ్యూలు, రేటింగ్​లు చూసి చాలా మంది టికెట్లు బుక్​ చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఖాతాలో ఓ సూపర్ డూపర్ హిట్​ పడినట్లే కనిపిస్తోంది.

Akhanda Trends in Twitter : మాస్ జాతర మొదలైంది! నందమూరి బాలకృష్ణ 'అఖండ' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై, మోత మోగిస్తోంది! మరోవైపు ట్విటర్​లోనూ అఖండ హవా నడుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్, సినిమా ప్రేక్షకులు ట్విటర్​లో అఖండ విజయం గురించి రకరకాల ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ట్విటర్​లో అఖండ సినిమాదే ట్రెండింగ్.

ఇవీ చదవండి :

akhanda review: బాలయ్య 'అఖండ' థియేటర్లలోకి వచ్చేసింది. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను తెగ అలరిస్తోంది! అయితే చిత్ర కథేంటి? బాలయ్య ఫైట్స్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సంక్రాంతి సినిమా సందడి నెలన్నర ముందే షురూ అయింది. పూర్తి మాస్ అంశాలతో తెరకెక్కిన బాలయ్య 'అఖండ' థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా అద్భుతంగా ఉందని అభిమానులు ట్విట్టర్​లో రాసుకొస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Last Updated : Dec 2, 2021, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details