నందమూరి నటసింహం బాలకృష్ణ మంచి దూకుడుమీదున్నాడు. ఇప్పటికే తన 105వ చిత్రంగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ బాలయ్యతో సినిమా చేసేందుకు ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటున్నాడట.
బాలయ్య దూకుడు.. పూరీతో మరో చిత్రం..! - balakrishna new movie with puri
టాలీవుడ్ హీరో బాలకృష్ణ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. బోయపాటితో చేయబోతున్న చిత్రం పూర్తయిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుందట.
![బాలయ్య దూకుడు.. పూరీతో మరో చిత్రం..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4463588-thumbnail-3x2-bali.jpg)
బాలయ్య
ఇప్పటికే బోయపాటితో బాలకృష్ణ 106వ చిత్రం చేస్తున్నట్లు ద్వారకా క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ - పూరీల చిత్రం ఉంటుందని సమాచారం. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పైసా వసూల్' ఘనవిజయం సాధించింది.
ఇవీ చూడండి.. 'పవన్ కల్యాణ్‌తో సినిమా కోసం ఎదురు చూస్తున్నా'
Last Updated : Sep 30, 2019, 10:23 PM IST