తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య కోసం మరో కథ సిద్ధమైందా? - బోయపాటి శ్రీను బాలయ్య

టాలీవుడ్​కు చెందిన ఓ ప్రేమకథా చిత్రాల దర్శకుడు నటసింహం బాలకృష్ణ కోసం ఓ కథ సిద్ధం చేశారట. త్వరలోనే ఈ కథను బాలయ్యకు వినిపించనున్నారని తెలుస్తోంది.

Balakrishna, director Venky Atluri to collaborate for a move
బాలయ్య కోసం మరో కథ సిద్ధమైందా?

By

Published : Jun 6, 2021, 6:47 AM IST

అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో సినిమాలు చేయడం కోసం యువ దర్శకులు పోటీపడుతున్నారు. ఇప్పటికే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమాకు పచ్చజెండా ఊపారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఆ చిత్రం కోసం నిజ జీవిత సంఘటనలతో ఓ స్క్రిప్టు సిద్ధమవుతోంది. మరోవైపు యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా బాలయ్య కోసం కథ సిద్ధం చేశారు.

ఇప్పుడా ఆ వరుసలో మరో యువ దర్శకుడు చేరినట్టు తెలిసింది. వరుసగా ప్రేమకథల్ని తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేసినట్టు సమాచారం.

దర్శకుడు వెంకీ అట్లూరి

మాస్‌లో తిరుగులేని కథానాయకుడు బాలకృష్ణ. ఆయన నటనకీ, శైలికీ ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడం కోసం ఉత్సాహం చూపిస్తున్నారు యువతరం. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చేస్తున్నారు.

ఇదీ చూడండి:Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున వరుస సర్​ప్రైజ్​లు!

ABOUT THE AUTHOR

...view details