తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ రోజు బాలయ్య సినిమా రీరిలీజ్ - బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి

బాలకృష్ణ-వి.వి.వినాయక్​ కాంబోలో వచ్చిన 'చెన్నకేశవరెడ్డి' అప్పట్లో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెప్టెంబరు 25 నాటికి ఈ చిత్రం విడుదలై 19 ఏళ్లు కానున్న సందర్భంగా మరోసారి ఈ సినిమా ప్రత్యేక షో ప్రదర్శించనున్నారు. ఎక్కడంటే..

balakrishna
బాలకృష్ణ

By

Published : Sep 19, 2021, 5:55 PM IST

హీరో బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమాలలో 'చెన్నకేశవరెడ్డి' ఒకటి. 2002లో విడుదలైన ఈ చిత్రం మాస్​ ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది. బ్లాక్​బాస్టర్​ హిట్​గా నిలిచింది. సెప్టెంబరు 25 నాటికి ఈ సినిమా విడుదలై 19ఏళ్లు కానుంది. ఈ సందర్భంగా ఆ రోజు ఈ మూవీని మరోసారి ప్రత్యేక ప్రదర్శన వేయనున్నారు. హైదరాబాద్​ ఆర్​టీసీ ఎక్స్​ రోడ్స్​లోని దేవి 70ఎమ్​ఎమ్​ థియేటర్​లో రాత్రి 9గంటలకు ఈ షో ప్రదర్శించనున్నారు. ఈ షోకు ముఖ్య అతిథిగా దర్శకుడు బోయపాటిశ్రీనును ఆహ్వానించారు.

'చెన్నకేశవరెడ్డి' యాక్షన్​ రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా రూపొందింది. ఇందులో బాలయ్య, టబు, శ్రియా, జయప్రకాష్​రెడ్డి, బ్రహ్మనందం తదితురులు ముఖ్య పాత్రల్లో నటించారు. వి.వి. వినాయక్​ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఇందులో బాలయ్య ఓ స్థానిక నాయకుడిగా, పోలీస్​ ఆఫీసర్​గా ద్విపాత్రాభినయంలో నటించి అదరగొట్టారు.

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమా చేస్తున్నారు. దసరాకు ఈ సినిమా సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. ప్రగ్యాజైశ్వాల్​ కథానాయిక. పూర్ణ, శ్రీకాంత్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: బాలయ్య 'అఖండ' నుంచి ఫస్ట్​ సాంగ్ వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details