అగ్ర కథానాయకులు నటిస్తున్న చిత్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్ మినహా మరేదీ పట్టాలెక్కలేదు. దసరా తర్వాతే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు పలువురు కథానాయకులు. సీనియర్ హీరో బాలకృష్ణ కూడా వచ్చే నెలలోనే కెమెరా ముందుకు వెళ్లబోతున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న సినిమా చిత్రీకరణ కరోనా వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది చిత్రబృందం.