తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్య నయా లుక్​.. 'బీబీ3' రిలీజ్​ డేట్​ ఫిక్స్​​ - bb3

పవర్​ఫుల్​ కథాంశంతో బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ ఏడాది మే 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

Balakrishna-Boyapati combo movie released on April
బాలయ్య నయా లుక్​.. 'బీబీ3' రిలీజ్​డేట్​ ఫిక్స్​​

By

Published : Jan 31, 2021, 3:38 PM IST

Updated : Jan 31, 2021, 3:52 PM IST

ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నందమూరి అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్​ సినిమా విడుదల తేదీని ఆదివారం ప్రకటించింది చిత్రబృందం. ఈ ఏడాది మే 28న విడుదల చేయనున్నట్లు తెలిపుతూ.. ఓ పోస్టర్​ను విడుదల చేసింది.

ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయంగా ప్రేక్షకులను మెప్పించనున్నారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో విజయవంతమైన 'సింహా', 'లెజెండ్‌' చిత్రాల తర్వాత రూపొందుతున్న చిత్రమిది. హీరోయిన్​గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. దీనికి తమన్ సంగీత దర్శకుడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Last Updated : Jan 31, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details