హిందూపురం ఎమ్మెల్యే, యువరత్న, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును తెలుగురాష్ట్రాల్లో ఆయన అభిమానులు వేడుకగా జరుపుకొన్నారు. కొవిడ్ దృష్ట్యా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. క్యాన్సర్ బారినపడిన పేదల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా ఎన్టీఆర్ క్యాన్సర్ ఆస్పత్రిని నెలకొల్పినట్లు ఆయన వెల్లడించారు.
పుట్టినరోజు వేడుకల్లో బాలయ్య - బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు ఈరోజు. కరోనా దృష్ట్యా హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
బాలయ్య
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి, తారక్, మహేశ్‌బాబుతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా బాలయ్యకు బర్త్‌డే విషెష్ తెలియజేశాడు.